Friday, April 26, 2024

సమంత చేతుల మీదుగా తిమ్మరుసు ప్రమోషనల్ సాంగ్

శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో యంగ్ హీరో సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం తిమ్మరుసు. ఇటీవలే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మంచి హిట్ ని అందుకున్నాడు సత్యదేవ్. ఇక ఇప్పటికే తిమ్మరుసు చిత్రానికి సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ పాటను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని రిలీజ్ చేశారు. అదేవిధంగా యూనిట్ కి అభినందనలు కూడా తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ నటిస్తున్నారు. బ్రహ్మాజీ, వైవా హర్ష మిగిలిన వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement