Tuesday, December 10, 2024

Thug Life | క‌మ‌ల్‌కు మ‌ణిర‌త్నం బ‌ర్త్ డే గిఫ్ట్..

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, లెజండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషనల్ లో ”థగ్‌ లైఫ్” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు కీలక పాత్రలో నటిస్తున్నారు. త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, జోజు జార్జ్‌, అభిరామి, నాజర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ, మేకర్స్ ఓ స్పెషల్ టీజర్ ను ఆవిష్కరించారు. నేడు ఉలగనాయగన్ కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ‘థగ్‌ లైఫ్’ రిలీజ్‌ డేట్‌ టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది.

2025 జూన్ 5వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఈ టీజర్ ను వదిలారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కమల్ హాసన్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపించి సర్ప్రైజ్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement