Thursday, April 18, 2024

మూడు రోజుల కస్టడీకి రాజ్ కుంద్రా..

పోర్న్ వీడియోస్ కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త నిర్మాత రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకు పోలీసు కస్టడీ విధిస్తై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీసులు విచారిస్తారు. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై ఆయన వ్యాపార భాగస్వాములు పోలీసు కేసు పెట్టారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి, కొన్ని యాప్స్ లో వాటిని రాజ్ కుంద్రా పబ్లిష్ చేయిస్తున్నట్టు తమ దగ్గర బలమైన ఆధారాలున్నాయని పోలీస్ కమీషనర్ సైతం గట్టిగా చెబుతుండటం విశేషం.

ఇది కూడా చదవండి: ఎలుకలు కొరికిన నోట్లను ఆర్బిఐకీ పంపిన అధికారులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement