Wednesday, December 11, 2024

Threatening Calls – షారూక్ ఖాన్ కు బెదిరింపు కాల్స్

కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో ప్రారంభ‌మైన హెచ్చ‌రిక‌లు తాజాగా షారూక్ ఖాన్ ను తాకాయి. కోరినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే చంపేస్తామంటూ చ‌త్తీస్ గ‌ర్ కు చెందిన‌ దుండగులు ఆయనకు కాల్ చేశారు. దుండగులు షారుఖ్ కు కాల్ చేసి నెక్ట్స్ చంపేది నిన్నే అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిపై షారూక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. బాంద్రా పోలీసులు ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్‌ స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఇక, కాల్‌ను ట్రేస్ చేసి రాయ్‌పూర్ లోని ఫైజాన్ ఖాన్ ఫోన్‌ను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement