Thursday, April 25, 2024

ఈ సారి శివాలెత్తి పోద్ది.. విశ్వ‌క్ సేన్ న్యూ మూవీ పోస్ట‌ర్

గంగాన‌మ్మ జాత‌ర మొద‌లైంద‌ని హీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రం పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. విశ్వక్ సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సితార బ్యానర్ లో రూపొందుతుంది.. ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ ప్రారంభించింది. షూటింగ్ అలా మొదలుపెట్టిందో లేదో దానికి సంబంధించిన కీలక అప్ డేట్ తో ముందుకు వచ్చింది. అభిమాలను ఆకట్టుకునేలా ఓ పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. చిత్రబృందం సోషల్ మీడియాలో విశ్వక్ ఫోటోను షేర్ చేస్తూ ‘గంగానమ్మ జాతర మొదలైంది. ఈ సారి శివాలెత్తి పోద్ది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్టర్ లో గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను చేతితో పట్టుకున్న విశ్వక్ సేన్ ఉండటం విశేషం. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమాకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లో ఇప్పటి వరకు చూడని విశ్వక్ సేన్ ని చూపిస్తారట. ఆ విషయం పోస్టర్ చూస్తే కూడా అర్థమౌతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement