Thursday, April 18, 2024

వకీల్ సాబ్ విషయంలో ఈ పాయింట్ అప్పుడు మిస్ అయింది !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే ఇప్పుడు ఓటీటీ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. దీంతో అందరు కూడా మరోసారి వకీల్ సాబ్ సినిమా చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎవరు నోట్ చేయని ఓ విషయాన్ని పవన్ అభిమానులు ఇప్పుడు నోట్ చేశారు. మామూలుగా సినీ స్టార్స్ ఎంట్రీ సమయంలో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పేరు పడుతూ ఉంటుంది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇచ్చే సమయంలో కూడా దర్శకనిర్మాతలు అద్భుతంగా డిజైన్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే పేరు వచ్చేటప్పుడు పంచభూతాలతో కలిపి వస్తుంది. కానీ రిలీజ్ సమయంలో దానిని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం అది చూసిన ఫ్యాన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. ఆ క్రెడిట్ మొత్తం వేణు శ్రీరామ్ కి ఇస్తూ థాంక్యూ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement