Friday, March 29, 2024

నా జీవితంలో ఇదే పెద్ద రెమ్యునరేషన్…నరేష్

సీనియర్ నటుడు నరేష్ ఎన్నో అద్భుతమైన సినిమాలను చేశారు. ఇప్పటి కూడా హీరో తండ్రిగా హీరోయిన్ తండ్రిగా లేదా సోదరుడిగా పాత్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని పాత్రలు చేసినా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా… దీనికి మించిన రెమ్యూనరేషన్ లేదు అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు నరేష్ . నరేష్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే నరేష్ రైతు గా మారి తాను వ్యవసాయం చేసి స్వయంగా పండించిన మామిడి పళ్ళు రేగు పళ్ళు అమ్మి డబ్బులు సంపాదించుకున్నారట.

ఆ ఫోటోలను కూడా షేర్ చేసి ఒక్కో కేజీ 50 రూపాయల చొప్పున విక్రయించి… మొత్తం 3600 రూపాయలు సంపాదించానని చెబుతున్నారు నరేష్. తాను ఇప్పటివరకు అందుకున్న అత్యధిక రెమ్యూనరేషన్ లో కన్నా ఇది గొప్పది అని ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయం ప్రయత్నించి అందులోని ఆనందం ఆస్వాదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement