Thursday, April 25, 2024

రామ్ కోసం దర్శకుడు పట్టుకున్న సీత ఈమెనే!!

దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో మృణాల్ దుల్కర్ సల్మాన్ ప్రేయసి సీతగా కనిపించనుంది. అలాగే మొదటిసారి ఈ ఇద్దరు జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement