Friday, April 19, 2024

‘వకీల్ సాబ్’ నుంచి మూడో సాంగ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి మూడో సింగిల్ ‘కంటిపాప’ విడుదలయింది. ఈ లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రీ రచించగా.. అర్మన్ మాలిక్ గాత్రం అందించాడు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. అల వైకుంఠపురంలో పాడిన బుట్టబొమ్మ తర్వాత అర్మన్ మాలిక్ పాడిన పాట ఇదే కావడం విశేషం. సాంగ్ ఆద్యాంతం మెలోడీతో ఆకట్టుకుంటుంది. అర్మన్ మాలిక్ గొంతు ఈ మాటను మరో లెవల్ కి తీసుకెళ్లింది. ఈ పాటను పవన్, శృతిహాసన్‌పై చిత్రీకరించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement