Friday, April 19, 2024

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలివే.. ఓ లుక్కేయండి.!

భారీ బడ్జెట్‌ చిత్రాలెన్నో థియేటర్లలో సందడి చేశాయి. మధ్యమధ్యలో కొన్ని స్మాల్​ మూవీస్​ కూడా మోస్తరు కలెక్షన్లు రాబట్టాయి. అయితే.. ఓటీటీలో కూడా ఈ వారం సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలేంటో తెలుసుకుందామా!

అశోకవనంలో అర్జున కల్యాణం..

మాస్‌ సినిమాలతో ఫాలోయింగ్‌ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్‌ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్‌ ధిల్లాన్‌ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ సినిమా మే 27 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది.

కణ్మణి రాంబో ఖతీజా..

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత మెయిన్​ రోల్​లో నటించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ‘కాతువాకుల రెండు కాదల్‌’. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్‌ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

- Advertisement -

అటాక్‌..

జాన్‌ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్‌: పార్ట్‌ 1. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement