Wednesday, April 24, 2024

రిలీజ్ కి రెడి అయ్యి వాయిదా పడిన సినిమాలు ఇవే !!

కరోనా కారణంగా గతేడాది సమ్మర్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. దీంతో సినీ అభిమానులు ఎంతో నిరాశ చెందారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. రిలీజ్ సిద్ధంగా ఉన్న చాలా సినిమాలు రిలీజ్ కాలేదు. మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా వేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాల వివరాలు చూసుకుంటే… షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావాల్సిన ఆచార్య సినిమా మే 13న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా వేసుకుంది. అలాగే నాగచైతన్య లవ్ స్టోరీ ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా కూడా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంది. ఇక నాని టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది. ఇది కూడా వాయిదా పడింది. అలాగే ఏప్రిల్ 30న విరాటపర్వం రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా కూడా వాయిదా పడింది.

ఇక మే 14న నారప్ప మే 28న అఖండ మే 28న రవితేజ ఖిలాడి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నారప్ప ఇప్పటికే రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నట్లు ప్రకటించగా… మిగిలిన రెండు సినిమాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఏదేమైనా ఈ ఏడాది కూడా సమ్మర్ కి ఒక్క సినిమా కూడా రిలీజ్ కావట్లేదు. దీనితో సినీ అభిమానులు నిరాశ చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement