Wednesday, April 17, 2024

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా సినిమా మాత్రమే థాయేటర్లలో రిలీజ్ కాబోతోంది.

దసరా- మార్చి 30

నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్‌ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

OTT విడుదలలు..

నెట్‌ ఫ్లిక్స్‌ :

మై లిటిల్ పోనీ- టెల్ యువర్ టేల్/వెబ్ సిరీస్ – మార్చి 27

- Advertisement -

ఎమర్జెన్సీ NYC/వెబ్ సిరీస్ – మార్చి 29

అన్ సీన్/మూవీ – మార్చి 29

మర్డర్ మిస్టరీ 2/మూవీ – మార్చి 31

అమిగోస్‌/మూవీ – ఏప్రిల్‌ 01

షెహజాదా/మూవీ – ఏప్రిల్ 01

డిస్నీ+హాట్‌స్టార్ :

అవతార్ 2/మూవీ – 28

శ్రీదేవి శోభన్ బాబు/మూవీ – మార్చి 30

గ్యాస్‌లైట్/మూవీ – మార్చి 31

ఆల్ దట్ బ్రీత్స్/మూవీ – మార్చి 31

ఆహా:

గోదారి/డాక్యుమెంటరీ – మార్చి 31

సత్తిగాని రెండెకరాలు/మూవీ – ఏప్రిల్ 01

ఈటీవీ విన్‌:

అసలు/ మూవీ – ఏప్రిల్ 05

Advertisement

తాజా వార్తలు

Advertisement