Thursday, April 25, 2024

ఇది అదిరిపోయే సర్ ప్రైజ్….వకీల్ సాబ్ లో పవన్ కొడుకు ?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ట్రైలర్ రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అయితే పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్. ఇక ఇదిలా ఉండగా వకీల్ సాబ్ సినిమా సెకండాఫ్ లో ఓ సర్ ప్రైజ్ ఉంటుందంటూ వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. కానీ ఒక్కసారి కూడా రివీల్ చేయలేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా యాంకర్ సుమ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ను సర్ ప్రైజ్ ఏంటని అడిగారు. అప్పుడు కూడా అది చెప్తే మీరు పెద్దగా ఊహించుకుంటారు. స్క్రీన్ పైన చూడండి అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సెకండాఫ్ లో పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ కనిపించబోతున్నాడట. ఓ స్పెషల్ పాత్రలో అకిరా నందన్ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అదే ఈ సినిమాలో ఉండే సర్ ప్రైజ్ గా తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే పవన్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement