Thursday, April 18, 2024

శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ ప్రాజెక్ట్ ఇదే ? బ్యూటీఫుల్ లవ్ స్టొరీ

మెగాస్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించిన వీడియోను రాజమౌళి రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా దీంతోపాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నాడు.

ఈ రెండు అయ్యాక చరణ్ ఏ సినిమా చేస్తాడని ఫ్యాన్స్ సందిగ్ధంలో పడినవేళ సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా లైన్ లో పెట్టాడట చరణ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోందట.

నిజానికి ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఎప్పటి నుంచో గాసిప్స్ వచ్చాయి. కాగా గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథను విన్న రామ్ చరణ్ వెంటనే ఓకే చేశాడట. అంతే కాకుండా ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. దీని పై క్లారిటీ రావాలంటే మాత్రం ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement