Wednesday, April 24, 2024

‘వాతి కమింగ్’ ఆదరగొడుతుంది

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా నటించిన చిత్రం మాస్టర్. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. మరోవైపు ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం కూడా అద్భుతంగా ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలోని వాతి కమింగ్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇప్పటికే లిరికల్ సాంగ్ తోపాటు ఫుల్ వీడియో సాంగ్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు లిరికల్ సాంగ్ 150 మిలియన్ లకు పైగా వ్యూస్ రానా వీడియో సాంగ్ కు రెండు మిలియన్ లైక్స్ టచ్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతే కాకుండా మరికొన్ని రికార్డు దిశగా ఈ సాంగ్ ఇప్పుడు దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement