Wednesday, April 24, 2024

వకీల్ సాబ్ మానియా…1మిలియన్ క్లబ్ కి చేరువలో పవన్

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కూడా సాధిస్తోంది. ఇక యుఎస్ఎలో ప్రీమియర్ షో లో నుండి 3 లక్షల డాలర్లు వసూలు చేయగా… ప్రీమియర్ షోస్ ఫస్ట్ డే సెకండ్ డే అడ్వాన్స్ బుకింగ్ లు కలిపి ఐదు లక్షల డాలర్లు వసూలు చేసింది.

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏడు లక్షల యాభై వేల డాలర్లు వసూలు చేసినట్లు యుఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హసన్ నటించగా… నివేద థామస్, అంజలి,అనన్య కీలక పాత్రలలో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement