Monday, March 25, 2024

బిచ్చగాడు 2….విజయ్ ఆంటోనీ దర్శకత్వంలో – అఫీషియల్

విజయ్ ఆంటోని గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో ఒక్క తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి విజయం సాధించాడు విజయ్ ఆంటోని. అంతకన్నా ముందు సంగీతదర్శకుడిగా, ఎడిటర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తొలిసారిగా దర్శకత్వం చేయబోతున్నాడు. బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ గా బిచ్చగాడు2 ను స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించబోతున్నాడు.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా మొదటి భాగాన్ని తెరకెక్కించిన విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ సంస్థే దీనిని కూడా నిర్మిస్తోంది. అలాగే ప్రముఖ రచయిత భాష్య శ్రీ ఈ సినిమాకు మాటలను అందిస్తున్నారు.

కాగా జూలై 24 విజయ్ ఆంటోనీ పుట్టిన రోజు సందర్భంగా చిత్రానికి సంబంధించిన లుక్ ని విడుదల చేశారు యూనిట్ సభ్యులు. విజయ్ ను దర్శకుడిగా అనౌన్స్ చేస్తూ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ బిచ్చగాడు2 చిత్ర పోస్టర్ ను విడుదల చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement