Thursday, April 18, 2024

ఊపందుకుంటున్న రీ రిలీజ్ ట్రెండ్.. మ‌ళ్లీ విడుద‌ల‌కు రెడీ అవుతున్న తారక్ మ‌రో మూవీ

టాలీవుడ్‌లో మొద‌లైన రీ-రిలీజ్ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. మొద‌ట్లో హీరోల బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రీ-రిలీజ్ చేసేవారు.. కానీ ఇప్పుడు సందర్భాలతో సంబంధం లేకుండా సినిమాలు రీ-రిలీజ్ అవుతునే ఉన్నాయి. పాత సినిమాల‌కు ఉన్న క్రేజ్‌ను చూపుతూ కొత్త సినిమాల కంటే కూడా కొన్ని సినిమాలు బాక్సాఫిస్ ద‌గ్గ‌ర‌ వసూళ్లు రాబ‌డుతున్నాయి. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన‌ సూపర్‌హిట్ మూవీ అదుర్స్. నయనతార, షీలా కథానాయికలుగా నటించారు.

- Advertisement -

ఇక రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అయితే ఈ మూవీని మార్చి నెలలో రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్లాన్‌లు జరుగుతున్నాయి. దీనికి సంబందించిన అధికారిక ప్ర‌ఖ‌ట‌న కూడా వచ్చింది. మార్చి 4న వరల్డ్ వైడ్ స్పెషల్ షోలు వేయనున్నట్టు నిర్మాతలు ప్రఖటించారు. ఇక ఈ సినిమాలో మ‌న ఆల్ టైమ్ ఫెవ‌రేట్ బ్రహ్మీ, ఎన్టీఆర్ కామెడీ ట్రాక్‌కి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అంతే కాకా ఈ సినిమాలో కొన్ని స‌న్నివేశాలు తరచుగా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో క‌నిపిస్తూను ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement