Friday, April 26, 2024

మహేష్ త్రివిక్రమ్ కు టైటిల్ రిలీజ్…@మే 31

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తిసురేష్ నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ రానుందట. మే 31న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ కానుందని తెలుస్తోంది. అలాగే మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. అదే సందర్భంగా సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక మహేష్ త్రివిక్రమ్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement