Tuesday, July 27, 2021

ముప్పు తప్పేలా లేదు… ప్రభుత్వానికి రెండే దారులు – నాగబాబు

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాకు థర్డ్ వేవ్ ముప్పు కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే లేననెత్తుతూ ఉంటారు.

తాజాగా కరోనా థర్డ్ వేవ్ పై స్పందిస్తూ… భారత్ కరోనా థర్డ్ వేవ్ ను అడ్డుకోగలదనే నమ్మకం ఉండేది. కానీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో జరుగుతున్న కన్వర్ యాత్రకి అనుమతి ఇవ్వడం వల్ల ముప్పు తప్పేలా లేదని అనిపిస్తోంది అని చెప్పుకొచ్చారు. అలాగే భారత్ ముందు రెండే దారులు ఉన్నాయని ఒకటి యాత్ర కి అనుమతి ఆపటం లేదా కరోనా ఆహ్వానించటం అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News