Saturday, April 20, 2024

ఈ సారి ఇద్దరూ కలిసే వస్తారట!!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే అటు ఎన్టీఆర్ కు సంబంధించి అలాగే ఇటు రామ్ చరణ్ కు సంబంధించి వేరువేరుగా టీజర్ లు రిలీజ్ అయ్యాయి. కానీ ఇద్దరిని కలిపి ఒకే టీజర్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం అందుకు ముహూర్తం కుదిరిందట. ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట చిత్రయూనిట్. ఇప్పటికే అందుకు సంబంధించి పనులు కూడా జరుగుతున్నాయట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే… చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement