Wednesday, April 24, 2024

వెంకీ ముందుగానే వచ్చేస్తున్నాడు!!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఉండగా ఈ సినిమాని ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

జూలై 20న నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. కాగా ఇప్పుడు నారప్ప అనుకున్న సమయం కంటే కొన్ని గంటల ముందు నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాత్రి పది గంటల నుండి నారప్ప స్ట్రీమ్ కాబోతుంది. ఇక యూఎస్ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement