Friday, June 18, 2021

బన్నీ తగ్గట్లేదుగా !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమాలో విలన్ గా నటించనున్నారు.

ఇదిలా ఉండగా కరోనా నేపథ్యంలో ఇండస్ట్రీలో పెద్ద సినిమాలన్నీ నిలిచిపోయాయి. అంతే కాకుండా ఆలస్యమైనా పర్వాలేదు అంతా కుదురుకున్నాకే షూటింగ్ చేద్దామని అనుకుంటున్నారు హీరోలు, దర్శకులు. కానీ సుకుమార్, బన్నీ మాత్రం రిస్క్ చేసైనా సరే సినిమాను అనుకున్న సమయానికి కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. బన్నీ, సుకుమార్ కమిట్మెంట్ చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలుగకమానదు.

Advertisement

తాజా వార్తలు

Prabha News