Thursday, April 25, 2024

అలియాభట్ ఔట్ @ఆర్ ఆర్ ఆర్

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ అలియాభట్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా… సరిగ్గా మూడు రోజుల క్రితం ముంబై నుంచి అలియాబాద్ హైదరాబాద్ కు ఈ సినిమా షూటింగ్ కోసం వచ్చారు. ఓ సాంగ్ చిత్రీకరణలో కూడా పాల్గొన్నారు.

కాగా ఇప్పుడు అలియాభట్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఈ సినిమా మొత్తానికి సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో అలియా భట్ ముంబై కు బయలుదేరారు. మళ్లీ ఈ సినిమా ప్రమోషన్ సమయంలో హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement