Tuesday, April 23, 2024

పుష్ప రాజ్ పయనం గోవాకి !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా బన్నీ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు తిరిగి రీస్టార్ట్ కాబోతోంది.

కాగా తదుపరి షెడ్యూల్ ను గోవా లో ప్లాన్ చేసినట్లు ల్ సమాచారం. ఇదివరకే గోవా లొకేషన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంట్రడక్షన్ సాంగ్ ను కూడా ఇక్కడే చిత్రీకరించనున్నారట. కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement