Friday, April 19, 2024

ఆర్ఆర్ఆర్ వాయిదా పక్కా ?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. దీంతో అక్టోబర్ 13న రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం మిగిలి ఉంది. సెకండ్ వేవ్ కారణంగా కొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. గతంలో లా ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమా రిలీజ్ కావాలంటే చాలా సమయం పట్టే లా కనిపిస్తుంది. అలా కాదని ఇప్పుడు రిలీజ్ చేస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవు. కాబట్టి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కచ్చితంగా వాయిదా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement