Thursday, March 28, 2024

అనుకున్న సమయానికే ఆర్ఆర్ఆర్ !!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి కొమరం భీమ్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా ఈ పోస్టర్ రాకముందే ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ బయటకు వచ్చింది. ఈ చిత్రం అనుకున్న సమయానికి రాదని ఎన్టీఆర్ పోస్టర్ తో పాటు కొత్త రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారని వార్తలు వినిపించాయి. నిజానికి మొదట అక్టోబర్ 13న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

కానీ కరోనా కారణంగా ఆ డేట్ ను చేంజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నిన్న పోస్టర్ లో మాత్రం రిలీజ్ డేట్ ను అక్టోబర్ 13నే ఫిక్స్ చేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటం లేదని క్లారిటీ వచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement