Wednesday, April 24, 2024

మ్యాజిక్ జరిగిందంటున్న RRR యూనిట్ – ఏంటో ఆ మ్యాజిక్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కాగా తాజాగా యూనిట్ ఒక లేటెస్ట్ అప్డేట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈరోజు స్టూడియో లో ఒక మ్యాజిక్ జరిగింది అంటూ ఈ సినిమాకు సంబంధించిన నేపథ్య సంగీతం గురించి ప్రస్తావించి త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ మీ ముందుకు రాబోతుంది అంటూ రాజమౌళి పోస్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement