Thursday, April 18, 2024

పుష్ప స్పీడ్ మామూలుగా లేదు…తగ్గేదేలే !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమాను రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఇదిలా ఉండగా సెకండ్ పార్ట్ కి సంబంధించి ఆల్రెడీ 10 శాతం షూటింగ్ పూర్తి చేయగా… ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తి చేశారట యూనిట్. ఇక మిగిలిన బ్యాలెన్స్ షూట్ ను సింగిల్ షాట్ లో తేల్చేయాలని ఫిక్స్ అయ్యాడట సుకుమార్. వచ్చే జూలై చివరి నాటికి కంప్లీట్ చేసి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement