Thursday, April 25, 2024

50 మందితోనే షూటింగ్ చేసేస్తున్న పుష్ప రాజ్ ?

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లు మళ్ళీ నిలిచిపోతున్నాయి. అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పటికే షూటింగ్ లను వాయిదా వేసుకున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం షూటింగ్ వాయిదా వేసుకోకుండా నిరంతరాయంగా నడుపుతున్నాడు.

ఇక ఇటీవల మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరం అయితే 50 మందికి మించకుండా షూటింగ్ జరుపుకోవాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నిబంధనలు పెట్టింది. ఈ మేర సుకుమార్ షూటింగ్ లో కేవలం 50 మందితో పెట్టుకున్నాడట. నిజానికి ఈ సినిమాకు 150 నుండి 200 మంది వరకు సిబ్బంది కావాలట. కానీ కరోనా నిబంధనల నేపథ్యంలో 50 మందితో షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement