Friday, March 29, 2024

ఎన్టీఆర్-కొర‌టాల కాంబినేష‌న్లో “ఎన్టీర్ 30” ప్రీ లుక్ పోస్ట‌ర్ అదిరింది క‌దూ..!

ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ 30 (కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 30వ సినిమా) రూపొందనున్న విశ‌యం తెలిసిందే. కల్యాణ్ రామ్ – కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జనతా గ్యారేజ్ తరువాత ఎన్టీఆర్ – కొరటాల నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వ‌స్తుందా.. ఎప్పుడు ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తారో.. అని అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రేపు (20వ తేదీన) ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో, ఎన్టీఆర్ 30 సినిమాకి సంబందించి కొంతసేపటి క్రితం ఓ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఆల్రెడీ శత్రు సంహారం చేసినట్టుగా రక్తం అంటిన వేటకొడవలి పట్టుకున్న ఎన్టీఆర్ చేయి మాత్రమే ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను బట్టే ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందనే విషయం అర్థంచేపుకొవ‌చ్చు. ప్రీ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూనే.. ఈ రోజు రాత్రి 7:02 నిమిషాలకు మరో అప్ డేట్ ఉంటుందంటూ మరింత ఆసక్తిని పెంచారు మేక‌ర్స్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement