Thursday, April 25, 2024

వకీల్ సాబ్ సినిమాలో పవన్ కొడుకు – ఇదే ప్రూఫ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు నేటివిటీకి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేశారు వేణు శ్రీరామ్. అయితే ఈ సినిమాలో పవన్ వన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. అలాగే అనన్య ,అంజలి ,నివేదాథామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఉండబోతోందని దర్శకుడు మొదటి నుంచి చెప్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ విషయాన్ని లేవనెత్తారు. కానీ దానిపై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ సర్ ప్రైజ్ ఏంటో కాదని పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ వకీల్ సాబ్ లో కనిపించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాగా ఆ వార్తలకు బలం చేకూరుస్తూ వకీల్ సాబ్ సెట్ లో అకీరానందన్ ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన అభిమానులు కచ్చితంగా ఆ సర్ ప్రైజ్ ఇదే అయ్యి ఉంటుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement