Thursday, April 18, 2024

మరో పాపకు సోనూసూద్ పేరు !!

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతుగా సహాయం చేశాడు. కాగా చాలా మంది సోనుసూద్ చేస్తున్న సహాయానికి పట్ల ఎంతో మంది కృతజ్ఞతలు తెలుపుతూ వారి షాపులకు పిల్లలకు సోనూ పేరును కూడా పెట్టుకున్నారు. చాలా ప్రాంతాలలో గుడిని కూడా కట్టించారు.

అయితే తాజాగా మహారాష్ట్ర ఓ దంపతులు తమ కూతురికి సోనూసూద్ పేరును పెట్టారు. కొంతకాలం క్రితం హార్ట్ ప్రాబ్లమ్ వారి పాపకు వచ్చిందట. అయితే ఆ పాపకు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు సహాయం చేశాడు సోనూ. ఆ తర్వాత పూర్తిగా ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంది ఆ పాప. సోనూ సహాయానికి కృతజ్ఞతగా ఆ తల్లిదండ్రులు తమ బిడ్డకు సోను అనే పేరు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement