Friday, April 26, 2024

మహేష్ బాబు 28వ సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. మహేష్ 28వ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో అతడు, ఖలేజా చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

సుమారు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు సినిమా వస్తోంది. ఇక ఈ సినిమా హారిక అండ్ హాసిని బ్యానర్ రాబోతుంది. 2022 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement