Friday, January 27, 2023

సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలివే.. తొడగొడుతున్న బాలయ్య ఫ్యాన్స్​

సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల రిలీజ్ డేట్లు దాదాపుగా అన్నీ కన్​ఫమ్​ అయ్యాయి. నందమూరి బాలకృష్ణ – వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి – వాల్తేరు వీరయ్య, విజయ్‌ల – వారిసు, అజిత్‌ – తునివు.. చిత్రాలు సంక్రాంతి రేస్​లో ఉండబోతున్నాయి. జనవరి 11న అజిత్ నటించిన తునివు మొదటగా తెరపైకి రానుంది. ఇక జనవరి 12న వరిసు, వీరసింహారెడ్డి సినిమాలు విడుదల కానున్నాయి. 13న మెగాస్టార్ వాల్‌టైర్ వీరయ్య విడుదల కానుంది.

- Advertisement -
   

తెలుగు రాష్ట్రాల్లో అజిత్ తునివుకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.. అయితే మిగిలిన సినిమాల మద్య థియేటర్ల కోసం భారీ పోటీ నెలకొంది. చిరంజీవి సినిమా కంటే ముందుగా తమ అభిమాన నటుడి సినిమా విడుదలవుతుందని బాలయ్య అభిమానులు మొదట్లో సంతోషించారు. అయితే విజయ్ వరిసు, వీరసింహారెడ్డికి ఒకే రోజు విడుదల కావడం వల్ల ఆ రోజు థియేటర్లుకు పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇక రేసులో చివరిగా చిరంజీవి వాల్తేరు వీరయ్య ఉంది. కానీ, టాక్ బాగుంటే, మిగిలిన సినిమాలకు తప్పకుండా పోటీ ఇస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement