Friday, April 19, 2024

రాజమౌళి ఇచ్చిన సర్ ప్రైజ్….ఆర్ఆర్ఆర్ న్యూ లుక్

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి2 సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే చిత్ర యూనిట్ తాజాగా ఓ సర్ప్రైజ్ ను ఇచ్చింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ బుల్లెట్ పై వెళ్తున్న ఓ కొత్త లుక్ ను పోస్ట్ చేస్తూ అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యిందని అలాగే ఎన్టీఆర్ రామ్ చరణ్ రెండు భాషల్లో డబ్బింగ్ కూడా పూర్తి చేశారని అలాగే కొన్ని రోజుల్లోనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అవుతుతాయని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement