Wednesday, April 24, 2024

హనుమంతుడు ఇతనే ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపోయించబోతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు నటించబోతున్నారనే దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం హనుమంతుడి పాత్ర లో మరాటి ప్రముఖ నటుడు దేవదత్ నాగే పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోందట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement