Thursday, April 25, 2024

‘దసరా’ సినిమాకి మిడ్ నైట్ ప్రీమియర్స్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్లాన్ చేస్తున్న మేకర్స్..

నాని దసరా రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ ప్యాన్-ఇండియా సినమా ఈ నెల (మార్చి) 30న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా, ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి 36 కట్స్ వచ్చాయి. అయినప్పటికీ, దసరా మూవీ టీమ్.. సినిమా విజయం అవుట్‌పుట్‌పై చాలా నమ్మకంగా ఉంది.

ప్యాన్-ఇండియా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ గా నిలుస్తోందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. నాని కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా ఈ నెల (మార్చి) 29న ఎంపిక చేసిన కొన్ని స్క్రీన్‌లలో మిడ్ నైట్ ప్రీమియర్‌లతో పాటు, రిలీజ్ డే ఉదయం 5 గంటల నుండి ఎర్లీ మార్నింగ్ షోలను ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్.

ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీని నిర్వహించారు. కాగా, మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement