Friday, April 19, 2024

కేజీఎఫ్2 టీజర్ తడాఖా!! 200 మిలియన్ల వ్యూస్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు స్థాయిలో హిట్ కొట్టింది. అలాగే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్2 తెరకెక్కుతోంది. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియా లో దుమ్ము దులుపుతుంది. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేసింది కే జి ఎఫ్2 టీజర్. 200 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇదే విషయాన్ని చెబుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. నిజానికి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వీలుపడలేదు. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement