Thursday, April 25, 2024

థియేటర్ లో రెస్పాన్స్ చూడాలని ఉంది – నివేద థామస్

పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఇక ఈ సినిమాలో నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు నివేద థామస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో నివేద థామస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ ఆ తర్వాత నిర్వహించిన ప్రమోషన్స్ లో కానీ పాల్గొనలేదు.

ఇదే విషయంపై నివేద మాట్లాడుతూ కరెక్ట్ గా ప్రమోషన్ టైంలో నాకు కరోనా రావటం కొంత బాధ అనిపించింది. అయితే రైట్ టైం కు నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. కానీ ఎప్పటిలా ఆరోగ్యం కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటికి వెళ్లి థియేటర్ లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలి అని ఉంది అంటూ చెప్పుకొచ్చింది నివేద థామస్.

Advertisement

తాజా వార్తలు

Advertisement