Monday, April 15, 2024

అఖండ రిలీజ్ డేట్ అప్పుడే ?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇదిలా ఉండగా చాలా సినిమాలు కరోనా కారణంగా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి.

ఈ క్రమంలోని అఖండ సినిమా కూడా రిలీజ్ డేట్ వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే వాయిదా విషయం పై చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కొత్త రిలీజ్ డేట్ కోసం దర్శకనిర్మాతలు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడట. అన్ని కుదిరినట్టు అయితే అఖండ విడుదల సెప్టెంబర్ లో ఉండవచ్చని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement