Friday, April 19, 2024

కేజీఎఫ్2 తరువాత మనమే – తగ్గేదేలే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది.

24 గంటలలోనే 25 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ పుష్ప టీమ్ పోస్టర్ ను విడుదల చేశారు. పుష్ప 24 గంటల్లో 25 మిలియన్ల వ్యూస్ సాధించగా సరిలేరు నీకెవ్వరు 14.64 మిలియన్ వ్యూస్, రాం ఫర్ బీమ్ 14.14 ,సాహో టీజర్ 12.94 మిలియన్లు, మహర్షి 11.14 సాధించాయి. కాగా కేజీఎఫ్ 2 మొదటి స్థానంలో ఉండగా… రెండో స్థానంలో పుష్ప నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement