Saturday, April 20, 2024

‘కేజీఎఫ్ 2’ యాక్షన్ సీన్ రీషూట్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కేజీఎఫ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అదే స్థాయిలో అంచనాలను క్రాస్ చేసింది. పెద్ద మొత్తంలో వసూళ్లను కూడా రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజిఎఫ్ 2 తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన గాసిప్ ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే షూట్ చేసిన ఓ యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్ మళ్లీ రీషూట్ చేయాలని భావిస్తున్నారట. ఆ సీన్ ను అంతకుమించి అనే విధంగా తీయటానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా అధికారికంగా ప్రస్తావన రాలేదు. మరి ఇందులో నిజం ఎంత వరకు ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement