Friday, March 29, 2024

మహా సముద్రం నుంచి ‘మహా’ లుక్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. అయితే అజయ్ భూపతి ప్రస్తుతం శర్వానంద్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో మహా సముద్రం సినిమా చేస్తున్నాడు . ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతిథి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే తాజాగా మహాసముద్రం సినిమాకు సంబంధించి అతిధి రావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సోలో అప్ మహాసముద్రం అంటూ ఈ లుక్ ను విడుదల చేసింది. కాగా అతిథి ఈ సినిమాలో మహా పాత్ర లో కనిపించనుంది. ఇటీవల శర్వానంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా దర్శకుడు రిలీజ్ చేశాడు. ఆ లుక్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement