Friday, September 24, 2021

భీమ్లా నాయక్ కాస్త గట్టిగానే పలుకుతున్నాడు

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దాదాపు 23కోట్ల రూపాయల మేర ఈ చిత్రానికి సంబంధించిన హక్కులు పలికినట్లు సమాచారం. అంతే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదు.మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News