Friday, April 19, 2024

The devil is back: ‘బంగార్రాజు’ కొత్త పోస్టర్

కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాల పోస్టర్లు ఒక్కొక్కటిగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఉదయమే గోస్ట్ సినిమాకు సంబంధించి విడుదలయి ఆకట్టుకొగా.. ఇప్పుడు బంగర్రాజు చిత్రం ఫోస్టర్ విడుదలయింది. 2016లో నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి “బంగార్రాజు” ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. “వైల్డ్ డాగ్‌”లో చివరిసారిగా కనిపించిన నాగార్జున “బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. ఆగస్టు 20న హైదరాబాద్‌లో ఈ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ఇందులో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ప్రీక్వెల్ “బంగార్రాజు”లో నాగ చైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించనున్నారు.

ఇది కూడా చదవండి: చిరిగిన బట్టలతో నటి గెహన వశిష్ట..!

Advertisement

తాజా వార్తలు

Advertisement