Tuesday, April 23, 2024

లైగర్ క్లైమాక్స్ ఇలా ఉండబోతుందా ?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లైగర్. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్స్ తో పాటు హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా క్లైమాక్స్ పై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. క్లైమాక్స్ దాదాపు 15 నిమిషాలపాటు ఉందట. వెరీ ఎమోషనల్ గా సాగే ఈ క్లైమాక్స్ యాక్షన్ తో పాటు ట్విస్ట్ లతో ఉంటుందట. ఇక ఈ సినిమాను పూరి ఛార్మి ల తో కలిపి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement