Wednesday, April 17, 2024

ధనుష్ ‘సర్’ మూవీపై క్రియేట్ అవుతున్న బజ్.. పోస్ట్ థియేట్రికల్ రైట్స్ ని సోంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్

మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ రాబోయే మూవీ సర్ (తమిళంలో వాతి). వెంకీ అట్లూరి రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ఈ నెల 17న విడుదలకు రెడీ అవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ కి జంటగా సంయుక్త మీనన్ కనిపించనుంది.

ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అండ్ సాంగ్స్ మూవీపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. కాగా, సినిమా OTT విషయానికి వస్తే, మూవీ పోస్ట్ థియేట్రికల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. మూవీ థియేట్రికల్ రిలీజ్ అయిన కొంతకాలానికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement