Sunday, September 24, 2023

జులై 27న ప్రైమ్‌ వీడియోలో రిలీజ్ కానున్న‌ ది బాట్‌మాన్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : మ్యాట్‌ రీవ్స్‌ రచన, దర్శకత్వంలో (వార్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌, డాన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ క్లోవర్‌ఫీల్డ్‌) రూపొంది, రీవ్స్‌, డైలాన్‌ క్లార్క్‌ నిర్మించినది బ్యాట్‌మాన్‌ (2022) చిత్రం విడుదల తేదీని ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. ది బ్యాట్‌మ్యాన్‌ చిత్రంలో గోతం నగర డిటెక్టివ్‌గా, కోటీశ్వరుడు బ్రూస్‌ వెయిన్‌ పాత్రల్లో ద్విపాత్రాబినయం చేసారు రాబర్డ్‌ ప్యాటిన్‌సన్‌. ప్యాటిన్సన్‌తో పాటు (టెనెట్‌, ది లైట్‌హౌస్‌) తో పాటు గోతం ప్రసిద్ధ, అపఖ్యాతి పాలైన పాత్రల్లో జోయ్‌ క్రావిట్జ్‌ (బిగ్‌ లిటిల్‌ లైస్‌, ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌: ది క్రైమ్స్‌ ఆఫ్‌ గ్రిండెల్‌వల్డ్‌ ) సెలీనా కైల్‌ పాత్రలో కనిపిస్తారు. పాల్‌ డానో (లవ్‌ అండ్‌ మెర్సీ 12 ఇయర్స్‌ ఏ స్లేవ్‌) ఎడ్వర్డ్‌ నాష్టన్‌, అలియాస్‌ ది రిడ్లర్‌ పాత్రలో నటించారు.

జెఫ్రీ రైట్‌ (నో టైమ్ టు డై, వెస్ట్‌వరల్డ్‌ ) జీసీపీడీ (గోతం సిటీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌) లెప్టినెంట్‌ జేమ్స్‌ గోర్డాన్‌గా, జాన్‌ టర్టుర్రో (ట్రాన్స్‌ఫార్మర్స్‌ సినిమాలు, ది ప్లాట్‌ ఎగైనెస్ట్‌ అమెరికా) కార్మైన్‌ ఫాల్కోన్‌గా, పీటర్‌ సర్స్‌గార్డ్‌ (ది మాగ్నిఫిసెంట్‌ సెవెన్‌, ఇంటరాగేషన్‌) గోతం డి.ఎ.గిల్‌ కాల్సన్‌గా, మేయర్‌ అభ్యర్థి బెల్లా రియల్‌గా జేమ్‌ లాసన్‌ (ఫేర్‌వెల్‌ అమోర్‌), ఆండీ సెర్కిస్‌ (ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ చిత్రాలు, బ్లాక్‌ పాంథర్‌) ఆల్ఫెడ్ర్‌గా, కోలిన్‌ ఫారెల్‌ (ది జెంటిల్‌మెన్‌, ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్ టు ఫైండ్‌ దెమ్‌) ఆస్ట్రేలియా, అలియాస్‌ పెంగ్విన్‌ పాత్రల్లో నటించారు. ది బ్యాట్‌మ్యాన్‌ ప్రైమ్‌ వీడియోలో జూలై 27 నుంచి ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారమవుతుంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement