Thursday, April 25, 2024

అలా వైకుంఠపురము లో హిందీ రీమేక్ టైటిల్ వచ్చేసింది !!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను సాధించింది. అలాగే వసూళ్ళ పరంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటించగా ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం లో తమన్ మ్యూజిక్ ముఖ్య పాత్ర పోషించింది.

అలాగే సుశాంత్, నివేద పేతురాజ్, మురళి శర్మ, టబు, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాను బాలీవుడ్ లో గీతాఆర్ట్స్ ఏక్తా కపూర్ తో కలిసి నిర్మించనున్నారు. లీడ్ రోల్ లో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ జంటగా నటించనున్నారు. ఈ చిత్రంలో టబు పాత్రలో మనీషా కోయిరాలా.. మురళి శర్మ పాత్రలో పరేష్ రావల్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు షెహజాదా అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement